- Advertisement -
కొజికోడ్(కేరళ): దేశంలోని వివిధ సంక్షేమ పథకాలు, విధానాలు పేదలకు అందడం లేదని(నాట్ పైవోటెడ్) సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. పథకాలు, విధానాలు పేదలకు అందితేనే సమ సమాజం ఏర్పడుతుందని చిదంబరం అన్నారు.
ఎంపి వీరేంద్ర కుమార్ స్మారక కార్యక్రమంలో ‘ఇన్ క్లూజివ్ గ్రోత్: మిత్ అండ్ రియాలిటీ’ అనే అంశంపై చిదంబరం ప్రసంగిస్తూ ఈ విషయాలు తెలిపారు.
‘‘ఒకదానికొకటి ప్రతిబింబించే ఆర్థిక, సామాజిక సోపానక్రమాలను మనం అర్థం చేసుకోకపోతే, మన పాలసీలు దిగువ వర్గానికి అందకపోతే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారినవర్గానికి అందకపోతే మనది సమసమాజం అనిపించుకోదు’’ అన్నారు.
సమ సమాజాన్ని నిర్మించడం ద్వారానే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ నేత చిదంబరం ఉద్ఘాటించారు.
- Advertisement -