Wednesday, January 22, 2025

పేదల అభ్యున్నతి కోసమే సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

నస్రుల్లాబాద్ (బాన్సువాడ): పేదల సంక్షేమం కోసమే అమలు చేసేవి సంక్షేమ పథకాలని, సంక్షేమ సంబరాల్లో జరుగుతున్న సమావేశం ఒక నమూనా అని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నస్రుల్లాబాద్ మండలంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే లక్ష రూపాయల నగదు సహాయాన్ని బాన్సువాడ నియోజకవర్గంలో మొదటి సారిగా సభాపతి లబ్ధ్దిదారులకు అందజేశారు. సభ అనంతరం యాదవ లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు.

ఇది మనందరి సంబరాల పండుగ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ పథకాలు లబ్ధ్దిదారులకు అందడం లేదన్నారు. కొన్ని ఇండ్లలో రెండు, మూడు పథకాలు అందుతున్న లబ్ధిదారులున్నారన్నారు. మేము ప్రజలకు చేసినవి చెబుతున్నామన్నారు. రైతుబంధు వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సమస్య తీరిందన్నారు. గ్రామాల్లో ఇంటి స్థలం లేని పేదలకు ప్రభుత్వం స్థలం అందజేస్తుందని, అందులో స్వంతంగా ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షల ఇంటి పథకం మంజూరు చేస్తామన్నారు. జూన్ 26న గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందజేస్తామన్నారు. ఈ భూములకు కూడా రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందన్నారు.

హ్యాట్రిక్ విజయంతో కెసిఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి అవుతారు…
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
పేదింటి ఆడ బిడ్డలకు మేనమామ లాగా కెసిఆర్ లక్ష 116 అందజేస్తున్నారని కెసిఆర్ హ్యాట్రిక్ విజయంతో మూడవ సారి ముఖ్యమంత్రి అవుతారని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో 100 జనరల్ ఫంక్షన్ హాల్స్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తక్కువ ఖర్చుతో పేదల పెండ్లిలు, శుభకార్యాల కోసం నిర్మిస్తున్నారన్నారు. బాన్సువాడ ఆస్పత్రి దేశంలోనే జాతీయ అవార్డు దక్కించుకుందని, పేద విద్యార్థులకు గురుకులాల ఏర్పాటు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసిఆర్ సహాయ, సహకారాలతో ఎన్నో విధాలుగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మంచి పాలనను అందిస్తున్నారన్నారు. విమర్శలు చేసే వారికి అభివృద్ధ్దితోనే గుణపాఠం చెబుతామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధ్యమని, పనిచేసే వారికే ప్రజలు బ్రహ్మరథం పడతారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News