- పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు
- నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
అక్కన్నపేట: గ్రామం యొక్క స మగ్ర అభివృద్ధి గురించి ప్రణాళికలు రచించే కేం ద్రాలు గ్రామపంచాయతీ భవనాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రా మంలో గ్రామ సర్పంచ్ పీచర సునీత రామన్న ఆధ్వర్యంలో 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించి న గ్రామపంచాయతీ భవనాన్ని హుస్నాబాద్ ఎ మ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వా గతం పలికారు. ఆయన మాట్లాడుతూ గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి గురించి ప్రణాళికలు రచి ంచే కేంద్రాలు గ్రామపంచాయతీ భవనాలని ప్రతి గ్రామానికి గ్రామపంచాయతీ భవనం ఒక గుండెకా య లాంటిదన్నారు.
గోవర్ధనగిరి గ్రామంలో ఎంతో ప్రాశస్త్యంగల సంజీవరాయ గుట్ట ఉందని కోరిన కో రికలు తీర్చే దేవుడు సంజీవరాయ దేవుడు అన్నారు. రానున్న కాలంలో గౌరవెల్లి సంజీవరాయి గుట్టతో గోవర్ధనగిరి గ్రామం మంచి పర్యాటక స్థలంగా మారుతుందని తెలిపారు. గోవర్ధనగిరి గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని హుస్నాబాద్ లో జరిగిన సభలో మంత్రి కెటిఆర్ ప్రస్తావించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ప్రతి గ్రామానికి గ్రామపంచాయతీ భవనా లు అలాగే గ్రామపంచాయతీ నిర్వహణ కోసం ట్రా క్టర్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సిసి రోడ్లు మురుగునీటి కాలువలు, సామాజిక భవనా లు, విద్యాలయాలు ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, సిఎం కెసిఆర్ అ న్నట్టు పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలని, పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,అందుకోసం సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి దేశంలో ఏ రాష్ట్ర ప్ర భుత్వం చేయనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ దేశంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలందరి ఘనతే అని కొనియాడారు.
జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపిపి మాలోతు లక్ష్మీ బీలు నాయక్, జడ్పిటిసి భూక్యా మంగా శ్రీనివాసు, ఎంపిడిఓ సత్యపాల్ రెడ్డి, ఎంపిఓ కవి కుమార్,డిఈ సదాశివరెడ్డి, ఏఈ స్నేహ, ఎంపిటిసి గొర్ల స్వప్న, ఉప సర్పంచ్ రాజు లతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపిటిసిలు గ్రామస్థులు పాల్గొన్నారు.