Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌కు శ్రీరామరక్షగా సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్ : రాష్ట్రంలో బీద బడుగు కుల మతాలకు, రైతులకు చేతి వృత్తులతోపా టు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాలపై భరోసా కల్పించిన మహానాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్ పార్టీకు శ్రీరామరక్షగా నిలబడతాయని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 3016 ను ండి 4016 రూ.రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్ పర్సన్ రజిని సాయి చందుతో కలిసి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పెం చిన ధృవపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్ పర్సన్ రజిని సాయి చందు శాసనసభ్యులు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన 50 సంవత్సరాల కాలంలో కేవలం పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందించరని గుర్తు చే శారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బిడ్డ రైతు పెట్టుబడి సహాయంతో పాటు గిట్టుబాటు ధర కలుపిస్తూ రైతును రాజాధిగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల 12వేల మంది దివ్యాంగులకు పెంచిన పెన్షన్ల ద్వా రా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

సంక్షేమ ప థకాలు ప్రతి ఇంట్లో అందాయని ప్రతి ఒక్కరు ము ఖ్యమంత్రి కెసిఆర్‌కు బ్రహ్మరథం ప్రాడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో దళిత గిరిజన డిక్లరేషన్ హామిలు గుర్తుకొచ్చాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నరాష్ట్రంలో డిక్లరేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రకటిస్తున్న సం క్షేమ పథకాలు చూపి కాపీ కొడుతూ ప్రజలను మ భ్యపెడుతున్నారని నమ్మటానికి ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశ సంపదను అనిల్ అంబానీ ఆధాని విజయ మాల్య కు దోచి పెట్టారని తెలిపారు. జరగబోయే ఎన్నిక ల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చె ప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జరగబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుని మూ డోసారి అదేకారంలోకి వస్తుందని దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంగారు శ్రీనివాసులు జెడ్పిటిసి డాక్టర్ శివరంజనిఆనంద్, వైస్ ఎంపీపీ కోటేష్ యాదవ్ , మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవికుమార్, సింగిల్ విండో అధ్యక్షులు గాడి కృష్ణ మూర్తి లక్ష్మికాంత్‌రెడ్డి, ఎంపీపీ మొగిలి శ్రీధర్ గౌడ్, ఆత్మకూర్ బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, అమరచింత మండల ం అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, కౌన్సిలర్లు కో ఆ ప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసీలు, బిఆర్‌ఎస్‌లు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News