Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అందరికీ సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -
  • బీసీ బంధు చెక్కులు అందించిన ఎమ్మెల్యే హరిప్రియనాయక్

గార్ల: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలోనే అందరికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందచేసినట్లు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో బీసీ బంధులో ఎంపికైన 50 మంది లబ్ధిదారులు, 48 కల్యాణలక్ష్మి, 6 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ లబ్ధిదారులకు అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందచేసినట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. ప్రతీ ఇంటిలో ఏదో ఒక విధంగా బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News