- ఎమ్మెల్యే దివాకర్‌రావు
దండేపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తేనే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం లింగాపూర్, నాయకపుగూడ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే దివాకర్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని 9 సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు.
మరోసారి తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టాడని ఆయన అన్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ అన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఓటర్లందరికి వివరించాలని ఆయన కోరారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను మేలు జరిగేలా ప్రవేశపెట్టాడని ఆయన అన్నారు. నాయకులందరు కలిసికట్టుగా ఉండి తమ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, నాయకులు బచ్చల అంజన్న, కృష్ణ, రమేష్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.