- Advertisement -
మనతెలంగాణ/యాదాద్రి: జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి సంక్షేమ పథకాల అమలు కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూఆలని అధికారులకు సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా, మార్గదర్శకాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అందించాలన్నారు. కలెక్టర్ హనుమంతరావు వెంట ఎంపీడీవో నవీన్, ఎంపీవో సలీమ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -