Wednesday, January 22, 2025

మహిళల పేరునే సంక్షేమ పథకాలు

- Advertisement -
- Advertisement -
  • జడ్పి చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి
  • మహిళా ఉత్తమ అధికారులకు సన్మానం

వికారాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వం లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని జడ్పి చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన మహిళా సంక్షేమ దినోత్సవంలో సునీతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం లో అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరునే అమలు చేస్తున్నట్లు తెలిపా రు.

ఇందులో ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, షీ టీమ్స్, వి హబ్, ప్రసూతి సెలవులు వంటి తదితర పథకాలు మహిళల కోసం అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా అధికారులకు సైతం ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చింది కేసీఆర్ అని అన్నా రు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News