Monday, December 23, 2024

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి

మంచాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలకపాత్ర పోషించాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో యువజన విభాగం మండల అధ్యక్ష, కార్యదర్శులు వనపర్తి బద్రినాధ్ గుప్తా, గంట విజయ్ కుమార్‌ల ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఈనెల 5న నిర్వహించే యువ సమ్మేళనం కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృషి మరువలేనిదని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం యువత సైనికులుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేష్, కాట్రోత్ బహదూర్, పిఎసిఎస్ చైర్మన్ పుల్లారెడ్డి, నాయకులు నూతనగంటి శేఖర్, జెర్కొని రాజు, మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీపాషా, ప్రవీణ్ నాయక్, మహేందర్ యాదవ్, చింతకింది వీరేష్ ముదిరాజ్, ప్రకాష్, పుణ్ణం రాము, సాయి, యాదగిరి గౌడ్, శ్రీకాంత్, నాగరాజు, రాజేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News