- Advertisement -
- అరుగంటల్లో పది సాధారణ ప్రసవాలు చేయడం గొప్ప విషయం
- ఫోన్ చేసి అభినందించిన జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి
వికారాబాద్: ఆరు గంటల్లో పది మంది గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసిన తాండూరు మాతా శిశు ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కరిష్మాకు జడ్పి చైర్‌పర్సన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అభినందించారు.
వైద్యుల సమష్టి కృషితో మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేయడంలో ఉత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సాధారణ ప్రసవాలతో మహిళలు సంపూర్ణ ఆరోగ్యాంగా, శారీరకంగా బలంగా ఉంటారని అన్నారు. ప్రతీ గర్భిణి మహిళా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
- Advertisement -