Thursday, January 23, 2025

మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన వెల్‌స్పన్ గ్రూప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వెల్‌స్పన్ గ్రూప్, తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమం ద్వారా, చేవెళ్ల మండలం పామెన గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి PMR హాస్పిటల్స్‌తో చేతులు కలిపింది. గ్రామస్థులకు సమగ్ర వైద్యసేవలు అందించడమే దీని లక్ష్యం. ఈ భారీ ఆరోగ్య శిబిరాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన వైద్య నిపుణులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్‌లతో సహా ఎనిమిది వేర్వేరు విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం లబ్ధిదారులకు తమ నైపుణ్యం, సహాయాన్ని అందించడానికి కలిసి వచ్చింది. ఈ శిబిరంలో వైద్య సహాయం కోరిన 198 మంది గ్రామస్తులకు వైద్య బృందం చేసిన సేవలు ఎనలేనివి.

పామెన గ్రామ సర్పంచ్ అక్నాపురం మల్లా రెడ్డి తన కృతజ్ఞతలు తెలుపుతూ, అట్టడుగు స్థాయి ఆరోగ్య సంరక్షణ రంగంలో వెల్‌స్పన్ ఫౌండేషన్, PMR హాస్పిటల్స్ చేస్తున్న ప్రశంసనీయమైన పనిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “అవసరంలో ఉన్నవారికి వారి ఇంటి వద్దనే మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అంకితమైనటువంటి నిబద్ధత కలిగిన సంస్థల మద్దతును మేము కలిగి ఉండటం పట్ల సంతోషంగా వున్నాము . ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా వారు అందించటం ద్వారా సమాజాన్ని శక్తివంతం చేస్తున్నారు” అని అన్నారు.

మెగా హెల్త్ క్యాంపు సమయంలో వైద్యులు సూచించిన మందులను రోగులకు ఉచితంగా అందించారు. అదనంగా, 17 మంది వ్యక్తులను తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రికి రిఫర్ చేయబడ్డారు లేదా అవసరమైన ఉచిత శస్త్రచికిత్సలకు అర్హులుగా పరిగణించబడ్డారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలను పరిష్కరించడానికి ఈ చురుకైన విధానం వ్యక్తులు వారి వైద్య పరిస్థితులకు అవసరమైన శ్రద్ధ మరియు సంరక్షణను పొందేలా చేస్తుంది.

ఈ మెగా హెల్త్ క్యాంప్ పట్ల వెల్‌స్పన్ ప్రతినిధి తన సంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ యొక్క అంకితభావాన్ని నొక్కిచెప్పారు, ” ఈ మెగా హెల్త్ క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించడం కమ్యూనిటీల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడంలో మా నిబద్ధతకు నిదర్శనం. మేము సహకార ప్రయత్నాల శక్తిని విశ్వసిస్తాము, గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి వైద్య నిపుణులు, వనరులను ఒకచోట చేర్చడానికి ఈ కార్యక్రమం మాకు వీలు కల్పించింది. PMR హాస్పిటల్స్ వంటి భాగస్వాములతో మేము చేతులు కలపడం ద్వారా సృష్టించగల సానుకూల ప్రభావాన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. కమ్యూనిటీలను శక్తివంతం చేయడం, హెల్త్‌కేర్ ల్యాండ్‌స్కేప్‌లో శాశ్వత మార్పును సృష్టించాలనే మా లక్ష్యంలో మేము స్థిరంగా ఉంటాము” అని అన్నారు.

ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో పిఎంఆర్ హాస్పిటల్ డిజిఎం డాక్టర్ సుమన్, వెల్‌స్పన్ అధికారులు, పామెన గ్రామ జిపి సెక్రటరీ ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి రాక, చురుకైన ప్రమేయం ప్రాధమిక స్థాయిలో ఆరోగ్య సంరక్షణ సవాళ్లను పరిష్కరించడంలో సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను మరింతగా వెల్లడి చేసింది.

మెగా హెల్త్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించడం ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ ల్యాండ్‌స్కేప్‌ను మెరుగుపరచడంలో వెల్‌స్పన్ ఫౌండేషన్, PMR హాస్పిటల్స్ యొక్క తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. వైద్య నిపుణులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా, వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా, ఈ కార్యక్రమం అందుబాటులో ఉండే మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సమిష్టి కార్యక్రమాల యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News