Thursday, January 23, 2025

వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ సీఈఓకు CNBC చేంజ్ మేకర్ అవార్డు

- Advertisement -
- Advertisement -

ముంబై: వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ యొక్క సీఈఓ & ఎండి దిపాలి గోయెంకా, మొట్టమొదటి CNBC చేంజ్‌మేకర్స్‌ అవార్డుల వద్ద ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో గుర్తింపు పొందారని వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు, దీర్ఘకాల వ్యాపార సవాళ్లను వినూత్న విధానాలను అనుసరించి ఎదుర్కోవటంతో పాటుగా, కొత్త మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకుంటూ తమ రంగాల్లో అసాధారణ విజయాన్ని ప్రదర్శించిన మహిళా నాయకులను గుర్తించి, గౌరవిస్తుంది.

దిపాలి గోయెంకా దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, వెల్స్పన్ వస్త్ర పరిశ్రమలో నూతన శిఖరాలను అధిరోహించటమే కాకుండా మహిళల నాయకత్వం. సాధికారత కోసం ప్రచారం చేయటంలో కూడా ముందంజలో ఉంది. ఆమె వ్యూహాత్మక పరిజ్ఞానం. శ్రేష్ఠత కోసం చేస్తున్న కృషి, ఆర్థిక వ్యవస్థ. వ్యాపార ప్రపంచానికి వెల్స్పన్ గణనీయమైన సహకారానికి మార్గం సుగమం చేశాయి.

2024 కోసం CNBC చేంజ్‌మేకర్స్ జాబితా, అస్థిర వ్యాపార ప్రపంచంలో అసమానతలను ధిక్కరించిన, ఆవిష్కరణలతో నడిచే మరియు అభివృద్ధి చెందిన విభిన్న రంగాల మహిళలను హైలైట్ చేస్తుంది. తమ ప్రయత్నాలు చేస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకుల నుండి ప్రభావవంతమైన సి-సూట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు, ఈ చేంజ్ మేకర్స్ కొత్త పుంతలు తొక్కారు. భవిష్యత్ నాయకుల కోసం ఒక మార్గాన్ని రూపొందించారు. CNBC చేంజ్‌మేకర్స్ గ్లోబల్ అవార్డు, ఆర్థిక వ్యవస్థ, వ్యాపారంపై వారి గణనీయ ప్రభావాన్ని నొక్కిచెబుతూ, సుప్రసిద్ధ, వెలుగులోకి రాని మహిళా నాయకుల విజయాలను వెలుగులోకి తెస్తుంది.

అవార్డును అందుకున్న, వెల్స్పన్ లివింగ్ యొక్క సీఈఓ & ఎండి, దిపాలి గోయెంకా తన కృతజ్ఞతను వెల్లడిస్తూనే, తమ లక్ష్యం సైతం వెల్లడించారు, “ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, వ్యాపార ప్రపంచం లో తమదైన మార్పును తీసుకురావాలని కృషి చేస్తున్న ప్రతి మహిళ యొక్క సమిష్టి కృషికి నిదర్శనం. వెల్స్పన్‌ వద్ద మేము, మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి సాధికారత కల్పించడాన్ని విశ్వసిస్తున్నాము. ఈ అవార్డు మరింత సమగ్రమైన మరియు సమానమైన పరిశ్రమను సృష్టించేందుకు మా నిబద్ధతను బలపరుస్తుంది. సంయుక్తంగా, మనము అడ్డంకులను ఛేదించడాన్ని కొనసాగించవచ్చు, స్థిరమైన, సమ్మిళిత, లింగ సమానత్వం కోసం మార్పును ప్రేరేపించవచ్చు ” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News