Saturday, November 9, 2024

వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ టవల్స్‌ను తయారు చేస్తున్న వెల్స్పన్

- Advertisement -
- Advertisement -

ముంబై: వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ తమ అనుబంధ బ్రాండ్ క్రిస్టీ ద్వారా వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ కు అధికారక టవల్ తయారీదారులుగా తన నిరంతర భాగస్వామ్యాన్ని కొనసాగించటం పట్ల సంతోషంగా ఉంది. గుజరాత్‌లోని వాపిలో ఉన్న బ్రాండ్ యొక్క టెర్రీ టవల్ సదుపాయం ఐకానిక్ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ టవల్స్‌ను తయారు చేయటం ప్రారంభించి ఈ సంవత్సరం కు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కార్లోస్ అల్కరాజ్ నుండి పీట్ సంప్రాస్, విలియమ్స్ సోదరీమణుల వరకు టెన్నిస్ ఛాంపియన్‌ల భుజాలపై కప్పబడటం ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ టవల్‌లు 2024లో కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి.

వెల్స్పన్ లివింగ్ యొక్క అనుబంధ సంస్థ క్రిస్టీ గత 37 సంవత్సరాలుగా వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ కు అధికారిక టవల్ సరఫరాదారుగా ఉంది. యుకె, ప్రపంచవ్యాప్తంగా రాకెట్ క్రీడలకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రతిబింబిస్తూ ఈ టవల్ ఇప్పుడు పునఃరూపకల్పన చేయబడింది. ల్యాండ్‌స్కేప్ నుండి పోర్ట్రెయిట్‌కు మార్పు చేస్తూ, ఈ టవల్‌లో ప్లేయర్‌ల సిల్హౌట్‌లు ‘ఆటలో’ ఉంటాయి. ఎక్కువమంది ఇష్టపడే క్రీడ, టెన్నిస్‌ను వేడుక జరుపుకోవడానికి ఉద్దేశించబడినవి .

వింబుల్డన్, వెల్స్పన్ యొక్క అత్యున్నత పర్యావరణ ప్రమాణాలు రెండింటినీ సమర్థిస్తూ, యునిసెక్స్ టవల్ OEKO-TEX® మేడ్ ఇన్ గ్రీన్ లేబుల్‌ను కలిగి ఉంటుంది. సాంస్కృతిక చరిత్రలో భాగంగా పరిగణించబడే టవల్ గా , ప్రతి సంవత్సరం క్లాసిక్ వింబుల్డన్ ‘గ్రీన్ & పర్పుల్’ లో విడుదల చేయటంతో పాటుగా తాజా ఫ్యాషన్ కలర్‌వేలో విడుదల చేయబడి, సంవత్సరానికి సూచికగా మారింది. 2023 హాట్ పింక్ గా విడుదలై, ఈ సంవత్సరం దానికి సమానంగా స్టేట్‌మెంట్ ను అందిస్తూ, ‘హైసింత్ & లావెండర్’ టవల్ ను గ్లోబల్ ట్రెండ్ ఫోర్‌కాస్టింగ్ గ్రూప్ WGSNతో సంప్రదింపులు జరిపి విడుదల చేసింది, రంగు ద్వారా భావోద్వేగాలు, శ్రేయస్సును పెంచడంతో పాటు సాంప్రదాయ ‘గ్రీన్ & పర్పుల్’ కలర్‌వే, టవల్స్ గ్లోబల్ అప్పీల్‌ను సమర్థిస్తుంది.

వినూత్నమైన హైగ్రోకాటన్ ® సాంకేతికతను ఉపయోగించి తయారు చేయబడిన టవల్ అత్యున్నత శోషక పత్తి నుండి సృష్టించబడింది, యార్న్స్ వినూత్నమైన తయారీ ప్రక్రియ అనుసరించి తయారు చేశారు. ఇది పూర్తి మెత్తగా టవల్ ను తీర్చిదిద్దటం తో పాటుగా వేగంగా పొడిగా మారేలా చేస్తుంది. ఇది క్రీడలు, సెలవులలో ఆస్వాదించటానికి అనువుగా ఉంటుంది.

ఈ చాంఫియన్‌షిప్‌లలో అత్యంత కీలకంగా నిలిచే ఆటగాళ్లు, వారి నైపుణ్యం, కష్టం మరియు ఆటలో తీవ్రంగా శ్రమించే స్త్రీ, పురుష ఆటగాళ్ల భౌతికత అంశాలను 2024 టవల్‌ వేడుక చేస్తుంది. రెండు విభిన్నమైన రంగులను మిళితం చేయడం ద్వారా ఈ ఫ్యాబ్రిక్‌ను తీర్చిదిద్దారు. ఈ చాంఫియన్‌షిప్స్‌ టవల్‌ రెండు రంగులతో నిర్మించబడింది. ఇది ముందు మరియు వెనుక వైపు కూడా ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.

చాంఫియన్‌షిప్‌లు, గెలుపు క్షణాలను ప్రతిబింబించే రీతిలో, అత్యుత్తమ పొడవులను తీసుకోవడం వల్ల ఈ టవల్స్‌ ఆ క్షణాలను కాంప్లిమెంట్‌ చేస్తాయి కోర్టు బయట నుంచి చూసినప్పుడు కూడా ఆన్‌ స్ర్కీన్‌ యాక్షన్‌ను డిట్రాక్ట్‌ చేయవని నిర్దారిస్తుంది. ఈ కలర్స్‌ను స్ర్కీన్‌ టెస్ట్‌ చేయడం వల్ల అవి అత్యుత్తమంగా నిలుస్తాయనే భరోసా అందిస్తుంది. అలాగే కెమెరాలో కూడా అవి అందంగా కనిపిస్తాయి.

బ్రిటీష్ సంస్కృతికి సంబంధించిన ఈ ఐకానిక్ ఐటెమ్ కొత్త రూపాన్ని సంతరించుకున్న సందర్భంగా, 2024 ఛాంపియన్‌షిప్‌ల టవల్‌లు సిజిఐ క్యాంపెయిన్, ‘ఐకాన్స్ మీట్ ఐకాన్స్’ ద్వారా ప్రచారం చేయబడ్డాయి. పలు వీడియోల శ్రేణి ద్వారా, ప్రసిద్ధ ఛాంపియన్‌షిప్ టవల్, గేట్‌వే ఆఫ్ ఇండియా, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఎలిజబెత్ టవర్, దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్‌లతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లను ఆకర్షనీయంగా చుడుతుంది.

అదనంగా 2024 సంవత్సరం కోసం వింబుల్డన్ బాత్రూమ్ టవల్స్ పరిమిత ఎడిషన్‌, ‘లోగో టవల్’, ‘ఏస్ టవల్’ను క్రిస్టీ పరిచయం చేస్తోంది. ఛాంపియన్‌షిప్స్ టవల్స్ ‘హెర్లూమ్ కలెక్షన్’ విడుదల చేయటంతో ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను దాటి కొనసాగుతుంది. ఈ కొత్త కలెక్షన్ లో మిగులు వింబుల్డన్ స్టాక్‌ను ఏటా వివిధ రకాల ధరించగలిగిన ఫ్యాషన్ పీస్ లుగా మార్చడం కనిపిస్తుంది – ఈ సంవత్సరం వాటిని ‘హెయిర్లూమ్ బ్యాగ్’ గా తీర్చిదిద్దారు

” మా సొంత సదుపాయాలలో ఈ తరహా అసాధారణ తయారీ సామర్థ్యాలను కలిగి ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాము. మా టవల్స్‌పై అత్యున్నత , ప్రత్యేకమైన ప్రభావాలను చేరుకోవడానికి ఇది తోడ్పడింది. అవి కేవలం గుర్తించతగినవి మాత్రమే కాదు, కోర్ట్స్‌, టీవీలలో చూసినప్పుడు అవి ప్రతిష్టాత్మకంగా ఉంటాయనే భరోసా అందిస్తుంది. వార్షిక టవల్‌ డిజైన్‌, డెలివరీలో భారీ మొత్తం పెట్టుబడి పెట్టాము. ఈ సంవత్సరం టవల్‌ హద్దులను అధిగమించడంతో పాటుగా సముచిత ఐకాన్‌ను ను సృష్టించడం సంతోషంగా ఉంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News