Monday, December 23, 2024

వెల్‌స్పన్ నూతన బ్రాండ్ గుర్తింపు విడుదల

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ సంస్థలలో ఒకటైన వెల్‌స్పన్ ఈరోజు తమ నూతన బ్రాండ్ గుర్తింపును విడుదల చేసింది. ఈ నూతన బ్రాండ్ గుర్తింపు అనేది తదుపరి స్థాయి అవకాశాలు, విలువ మరియు అనుభవాలను అందించడానికి దాని వ్యూహాత్మక, వైవిధ్యభరితమైన ప్రయత్నాలపై నిర్మించబడిన వెల్‌స్పన్ యొక్క ధైర్యవంతమైన విస్తరణ, వృద్ధి యొక్క హాల్ మార్క్ కథనాన్ని గుర్తించడానికి సృష్టించబడింది. ‘ది ఎక్స్‌పోనెంట్’ అని నామకరణం చేయబడిన కొత్త చిహ్నం చరిత్ర, భవిష్యత్తు రెండింటినీ సూచించడానికి ఆధునికీకరించిన వర్డ్‌మార్క్ చివరిలో పైకి ఎత్తినట్లుగా రూపొందించబడింది. విశేషమైన ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్ వృద్ధి ద్వారా సంవత్సరాలుగా నిర్మించబడిన విస్తృత స్థాయి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న అంబ్రెల్లా బ్రాండ్‌కు వెల్‌స్పన్ వరల్డ్ అని నామకరణం చేయబడింది.

బ్రాండ్ యొక్క నూతన గుర్తింపు గురించి వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ B.K. గోయెంకా మాట్లాడుతూ “నిత్యం అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రపంచంలో, అసాధారణ వృద్ధిని సాధించటం అనేది ఉద్దేశాలను అధిగమించినదని వెల్‌స్పన్ గుర్తించింది. వ్యక్తులను శక్తివంతం చేసే, అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలను ప్రోత్సహించే, పర్యావరణ అనుకూల గ్రహాన్ని పెంపొందించే విప్లవాత్మక అవకాశాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా నిజమైన వృద్ధి సాధ్యమవుతుంది. ఇది పనులను ఖచ్చితత్వంతో అమలు చేయడం నుండి మాత్రమే కాకుండా, వాస్తవికంగా వ్యత్యాసాన్ని కలిగించే కార్యక్రమాలను చేపట్టడం నుండి కూడా వస్తుంది. వ్యక్తులు, వ్యాపారాలు, కమ్యూనిటీలపై మా బ్రాండ్ అభివృద్ధి శక్తివంతమైన ప్రభావం చూపాలంటే అది ప్రామాణికమైనదిగా ఉండాలని మేము గ్రహించాము. వెల్‌స్పన్ యొక్క గతంలోని పరివర్తనాత్మక విజయాల యొక్క సాహసోపేతమైన ప్రయాణంలో మా హృదయం ఉంది, అలాగే ఎదురుచూసే అనంతమైన అవకాశాలను స్వీకరించడానికి దాని దృఢమైన అంకితభావమూ కనిపిస్తుంది. ఈ లొంగని స్ఫూర్తితో మార్గనిర్దేశం చేయబడి, కంపెనీ మార్పును హృదయపూర్వకంగా స్వీకరిస్తుంది, నిర్భయంగా అజ్ఞాత ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి మరియు రేపటి సవాళ్లను జయించడానికి సిద్ధంగా ఉంది” అని అన్నారు.

కొత్త లోగో, డబుల్ టిక్ కలిగి ఉంది. “పనులను సరిగ్గా చేయడం”, “సరైన పనులను చేయడం” రెండింటికీ కంపెనీ అంకితభావాన్ని ఇది సూచిస్తుంది. ఇది అత్యాధునిక సాంకేతికత, ప్రతిభ పై ఆధారపడి వెల్‌స్పన్ యొక్క అపూర్వమైన వృద్ధి, నిష్ణాతత్వం కోసం ఎనలేని సాధన, బుద్ధికుశలత కోసం అవిశ్రాంత ప్రయత్నంకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లోగో వెల్‌స్పన్ ను వ్యక్తులకు, వ్యాపారాలకు సానుకూల మార్పును అందించే శక్తిగా చూపుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News