Monday, January 27, 2025

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు… ముగ్గురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో విషాదచాయలు అలుముకున్నాయి. వరుడితో ఇద్దరు సోదరి మణులు సజీవదహనమైన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దుర్గాపూర్‌లో మంగళ్ సోరెన్(33)కు ఇద్దరు సోదరీలు సుమీ(35), బహమనీ(23) ఉన్నారు. పెళ్లి వేడకుల నిమిత్తం ఇద్దరు తన సోదరి ఇంటికి వచ్చారు.

Also Read: చిక్కుల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి?

వధువు తరపు కుటుంబ సభ్యులు మంగళ్ ఇంటికి ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. శనివారం మంగళ్ తండ్రి హప్నా సోరెన్ బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మంటలు వస్తుండడంతో డోర్ పగులగొట్టి ఓపెన్ చేశారు. అప్పటికే మంగళ్, బహమనీ, సుమీ సజీవదహనమయ్యారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని ఏం జరిగిందో తెలియదన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News