- Advertisement -
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష నేత బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం విషమించింది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో శనివారం చేర్పించారు. 79 సంవత్సరాల బుద్ధదేవ్‌కు ఇప్పుడు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అత్యవసర చికిత్సల విభాగం(ఐసియూ)లో ఉంచి ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిస్థితిని సమీక్షిస్తోంది. 2000 సంవత్సరం నుంచి 2011 వరకూ బెంగాల్ సిఎంగా ఉన్న ఈ సీనియర్ నేత చాలాకాలంగా శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది , ఇతరత్రా వయోధిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ సాంద్రత పడిపోయిందని, ఇప్పుడు స్పృహలో లేరని అధికారులు తెలిపారు.
- Advertisement -