- Advertisement -
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ తుదిశ్యాస విడిచారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. సిపిఎం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. జ్యోతిబసు మంత్రవర్గంలో మంత్రిగా పని చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1944 మార్చి బెంగాల్ ప్రెసిడెన్సీలో బుద్ధదేవ్ జన్మించారు. సిపిఎం పార్టీలో రాకముందు స్కూళ్లో టీచర్ గా పని చేశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.
- Advertisement -