బాదిత హిందూవుల ఇండ్లకు గవర్నర్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ శనివారం ఘర్షణలహిందూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వక్ఫ్ చట్టం పట్ల నిరసనలు రాష్ట్రంలో హింసాకాండకు దారితీశాయి. హిందూ కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. అల్లరిమూకల దాడితో ఓ కుటుంబ పెద్ద ఆయన కుమారుడు గాయాల పాలయ్యి మృతి చెందారు. విషయం తెలిసిన తరువాత గవర్నర్ ఈ కుటుంబం ఉండే చోటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముర్షిదాబాద్ జిల్లాలో దాడులు ఎక్కువగా జరిగాయి. ఇక్కడి బాధితులకు మనో స్థయిర్యం కల్పించేందుకు గవర్నర్ యత్నించారు.
కుటుంబానికి తగు సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సీనియర్ అధికారి ఒక్కరు తెలిపారు. శంషేర్ గంజ్ లోని జాఫ్రాబాద్‌లో ఓ ఇంట్లో ఇద్దరి మృతదేహాలను కనుగొన్నారు. అక్కడ జరిగిన ఘటనపై సిబిఐ దర్యాప్తునకు సూచిస్తామని గవర్నర్ తెలిపారు. బాధితుల ఇళ్లకు గవర్నర్ వెళ్లడం రాజకీయ వివాదానికిదారితీసింది. గవర్నర్ తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోరారు. అయితే గవర్నర్ పర్యటన కొనసాగింది. పలు ప్రాంతాలలో ఏర్పాటు అయిన సహాయక శిబిరాలను గవర్నర్ అధికార బృందంతో కలిసి సందర్శించారు. బాధితులకు పునరావాస చర్యలపై సమీక్షించారు. తగు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.