Thursday, January 23, 2025

ఉద్యోగం నుంచి మంత్రి కుమార్తె బర్తరఫ్

- Advertisement -
- Advertisement -

ఉద్యోగం నుంచి మంత్రి కుమార్తె బర్తరఫ్
కలకత్తా హైకోర్టు తీర్పు

West bengal High Court dismiss educational ministers daughter

కోల్‌కత: ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్ విద్యా శాఖ మంత్రి పరేష్ చంద్ర అధికారి కుమార్తెను ఉద్యోగం నుంచి కలకత్తా హైకోర్టు శుక్రవారం బర్తరఫ్ చేసింది. టీచర్‌గా ఇప్పటివరకు పనిచేసిన కాలానికి పొందిన జీతాన్ని వాపసు చేయాలని కూడా హైకోర్టు ఆమెను ఆదేశించింది. 2018 నవంబర్ నుంచి తీసుకున్న వేతనాన్ని రెండు దఫాలుగా హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలని మంత్రి కుమార్తె అంకితా అధికారిని జస్టిస్ అవిజిత్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆదేశించింది.

ఉద్యోగ నియామక పరీక్షలో తనకు అంకితా అధికారి కన్నా అధికారి మార్కులు వచ్చినప్పటికీ తనకు కాకుండా టీచర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇచ్చారంటూ ఒక అభ్యర్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కాగా..తన కుమార్తె చట్టవిరుద్ధ నియామకంపై దర్యాప్తు జరుగుతుండడంతో మంత్రి పరేష్ శుక్రవారం ఉదయం ఇక్కడి సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ హైకోర్టు విధించిన గడువును మంత్రి పాటించకపోవడంతో గురువారం సిబిఐ ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News