Monday, January 20, 2025

రూ.5 కోసం హత్య… నలుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: మద్యం బాటిల్‌కు ఐదు రూపాయలు తక్కువగా ఇచ్చారని మద్య ప్రియుడ్ని వైన్ షాప్ సిబ్బంది కొట్టి చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో జరిగింది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢాకురియా బ్రిడ్జి ప్రాంతంలో సౌతర్న్ స్టోర్ లిక్కర్ షాప్‌ను దెబోజ్యోతి సాహా నడిపిస్తున్నాడు. సుశాంటా మండల్ అనే వ్యక్తి మద్యం బాటిల్ కొనుగోలు చేయడానికి వైన్ షాప్‌కు వచ్చాడు. మండల్ దగ్గర ఐదు రూపాయలు తక్కువగా ఉండడంతో వైన్ షాప్ సిబ్బంది, మండల్ మధ్య గొడవ జరిగింది. వైన్ షాప్ యజమాని, సిబ్బంది అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

Also Read: రాహుల్‌కు మీరే అమ్మాయిని చూడండి: మహిళా రైతులతో సోనియా(వైరల్ వీడియో)

వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు ఐపిసి సెక్షన్ 302/34 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ షాపు ఎదుట స్థానికులు ధర్నాకు దిగారు. సిసిటివి ఆధారంగా నలుగులు నిందితులపై దాడి చేసినట్టు గుర్తించారు. డెబోజ్యోతి, అమిత్ కౌర్, ప్రభట్ దత్తా అలియా టింకూ, ప్రసెంజిత్ బైద్యాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐదు రూపాయల కోసం ప్రాణం తీయడం సరికాదని నెటిజన్లు వాపోతున్నారు. ఆవేశానికి పోతే అనర్థాలు మిగులుతాయని ఈ ఘటన తెలిసి వచ్చిందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News