Friday, December 20, 2024

పది రూపాయల కోసం స్నేహితుడి తలపై రాయితో బాది

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కతా: పది రూపాయల కోసం స్నేహితుడి చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురిలో జరిగింది. బైకుంతాపూర్‌లో ప్రాంతంలో సుబ్రతా దాస్, అజయ్ రాయ్, రామ్‌ప్రసాద్ సహా అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ముగ్గురు ప్రతీ రోజు డ్రగ్స్‌కు బానిసగా మారారు. రామ్‌ప్రసాద్ దగ్గర డ్రగ్స్ తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో సుబ్రతా దాస్‌ను పది రూపాయలు అడిగాడు. ఇద్దరు మత్తులో ఉండడంతో సుబ్రతా తన దగ్గర డబ్బులు లేవని బదులిచ్చాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో సుబ్రతా రాయి తీసుకొని రామ్ ప్రసాద్ తలపై పలుమార్లు బాదాడు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అక్కడి నుంచి సుబ్రతా పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాకి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా సుబ్రతాను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News