Monday, January 20, 2025

స్నేహితుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: ఆన్‌లైన్ గేమ్ పాస్‌వర్డ్ చెప్పలేదని పదో తరగతి విద్యార్థిని స్నేహితులు చంపిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షీదాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పపాయ్ దాస్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. పపాయ్ ఆన్‌లైన్ గేమ్స్ బానిసగా మారాడు. రోజు తన స్నేహితులతో కలిసి ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఈ క్రమంలో నలుగురు స్నేహితులతో కలిసి ఆన్‌లైన గేమ్స్ ఆడుతుండగా పాస్‌వర్డ్ చెప్పాలని పపాయ్ దాసును అడిగారు. అతడు పాస్‌వర్డ్ చెప్పకపోవడంతో నలుగురు స్నేహితులు అతడితో గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో నలుగురు కలిసి అతడిని చంపేశారు. నిశీంద్ర ఘాట్ సమీపంలో కాలిపోయిన మృతదేహం కనిపించడంతో పపాయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News