Monday, January 20, 2025

తుది తీర్పు తరువాతనే ఫలితాలు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కలకత్తా హైకోర్టు బుధవారం కీలక రూలింగ్ వెలువరించింది. హింసాకాండ , విధ్వంసం పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వెల్లడి, ఎన్నికల విషయంపై తమ తుదితీర్పు ఫైనల్ అవుతుందని తెలిపింది. అన్ని అంశాలను విచారించిన తరువాత వెలువడే తుది తీర్పు తరువాతనే ఎన్నికల ఫలితాల విషయం స్పష్టం అవుతుందని స్పష్టం చేశారు. సంబంధిత అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విజేతలుగా ప్రకటితులైన అభ్యర్థులందరికి హైకోర్టు రూలింగ్ వివరాలు తెలియచేయాలని కోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News