Thursday, January 23, 2025

భర్త మర్మాంగాలను కట్ చేసి శవాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసింది….

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ప్రియురాలు తన ప్రియుడితో కలిసి భర్తను చంపి… మర్మాంగాలు కట్ చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు పోసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురులియా ప్రాంతంలో జరిగింది. ప్రియుడి, ప్రియురాలును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….జైపూర్ ప్రాంతంలోని రంగునితా గ్రామంలో జుడాన్ మహతో, ఉత్తర దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. షిలాపూర్ గ్రామానికి చెందిన క్షేత్రపాల్‌తో ఉత్తరకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో పాటు వారు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో జుడాన్‌ను చంపాలని ప్లాన్ వేశారు. జుడాన్‌ను క్షేత్రపాల్ రాయితో కొట్టాడు.

అనంతరం భర్త మర్మాంగాలను కట్ చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు పోశారు. తన భర్త కనిపించడంలేదని తన కుమారుడు అబుర్వాతో కలిసి జైపూర్ పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎక్కడా భర్త ఆచూకీ కనిపించలేదు. సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి దుర్వాసన రావడంతో కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడి చేరుకొని సెప్టిక్ ట్యాంకులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఉత్తరా దేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త అడ్డుగా ఉండడంతో చంపేశానని వివరణ ఇచ్చింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. క్షేత్రపాల్ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News