కోల్‌కత: పరిపాలనా కార్యకలాపాలను మరింత సరళతరం చేసే ప్రయత్నంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దక్షిణ 24 పరగణాల జిల్లాను మూడు జిల్లాలుగా విడగొట్టాలని యోచిస్తోంది. ఈ జిల్లాను బరుయ్‌పూర్, సుందర్‌బన్స్, డైమండ్ హార్బర్ పేరిట మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా అయిన దక్షిణ 24 పరగణాలను మూడు భాగాలు చేసేందుకు అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి మూడు కొత్త జిల్లాలు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమోదం తెలిపిన వెంటనే బంగాళా ఖాతం వెంబడి ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లా స్థానంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పడతాయని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఈ జిల్లా ప్రజలు పరిపాలనా సంబంధ పనుల కోసం వందల మైళ్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
బెంగాల్‌లో త్వరలో మూడు కొత్త జిల్లాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -