Wednesday, January 22, 2025

పెళ్లి చేసుకున్నాడు…. కలిసుందామంటే కత్తితో పొడిచి చంపాడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కారులో వెళ్తుండగా కలిసి ఉందామని భార్య అడగడంతో ఆమెను భర్త కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అతడు పారిపోతుండగా పోలీసు కానిస్టేబుల్ పట్టుకున్న సంఘటన ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గౌతమ్ అనే వ్యక్తి రఘుబీర్ నగర్‌లో నివసిస్తున్నాడు. మన్య అనే మహిళతో పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులకు తెలియకుండా గౌతమ్, మన్య మార్చి నెలలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. అప్పడప్పుడు కలుసుకుంటున్నారు.

రాజౌరీ గార్డెన్‌లోని తీతర్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు కలుసుకున్నారు. కారులో ఇద్దరు వెళ్తుండగా కలిసి ఉందామని గౌతమ్‌ను మన్య అడిగింది. ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని భార్యను పలుమార్లు భర్త పొడిచాడు. చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత కారును శివాజీ కాలేజీ సమీపంలోని రెడ్ లైట్ వద్ద పార్కింగ్ చేసి వెళ్లిపోయాడు. ఖయలా పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ షర్ట్ లేకుండా వెళ్తుండడం అజయ్ అనే కానిస్టేబుల్ గమనించి అతడిని నిలదీశాడు. తన భార్యను హత్య చేశానని ఒప్పుకోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఇరు వైపులా కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు తెలియదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News