Sunday, December 22, 2024

విద్యార్థినికి తాళి కట్టి, రేప్ చేసిన టీచర్

- Advertisement -
- Advertisement -

పాఠాలు చెప్పమంటే, ప్రేమ పాఠాలు వల్లించి ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడొక టీచర్. ప్రేమించానంటూ మైనర్ బాలికను నమ్మించి, తాళికట్టి రేప్ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

భీమవరం రూరల్ మండలంలోని ఓ గ్రామంలో హిందీ టీచర్ గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు పదిహేనేళ్ల విద్యార్థినిపై కన్నేశాడు. నాలుగు రోజుల క్రితం ఆ అమ్మాయిని మాయ మాటలుచెప్పి, తన మోటర్ సైకిల్ పై ఎక్కించుకుని తాడేరు తీసుకువెళ్లాడు. ఆమె మెడలో తాళి కట్టి, అదే రోజు ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News