Tuesday, March 4, 2025

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

- Advertisement -
 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తుణుకు రూరల్  పోలీస్ స్టేషన్ లో తన తుపాకీతో ఎస్ఐ ఎజిఎస్ మూర్తి కాల్చుకున్నాడు. వెంటనే సిబ్బంది అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఇటీవల అతడిపై పలు ఆరోపణల రావడంతో సదరు ఎస్ఐని సస్పెండ్ చేసినట్టు సమాచారం. పెనుగొండలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందోబస్తుకు వెళ్లే క్రమంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. కొంచెం సేపు కూర్చొని బాత్‌రూమ్‌లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకొని మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News