Monday, January 20, 2025

భారత్‌తో సిరీస్‌కు విండీస్ టి20 ఎంపిక

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్ : భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం వెస్టిండీస్ టీమ్‌ను ఎంపిక చేశారు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి టి20 సిరీస్ జరుగనుంది. సిరీస్ కోసం విండీస్ బోర్డు 15 మంది ఆటగాళ్లతో కూడిన పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది. సిరీస్‌లో విండీస్ టీమ్‌కు రోమన్ పొవెల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

మాజీ కెప్టెన్లు నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్ తదితరులు జట్టులోకి వచ్చారు. వీరితో పాటు వన్డే కెప్టెన్ షై హోప్ కూడా ఎంపికయ్యాడు. విధ్వంసక బ్యాటర్ హెట్‌మెయిర్‌ను కూడా సిరీస్‌లో చోటు కల్పించారు. సొంత గడ్డపై వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ కోసం మెరుగైన జట్టును తయారు చేయాలనే ఉద్దేశంతో కీలక ఆటగాళ్లందరికి చోటు కల్పించినట్టు విండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హెయిన్స్ వెల్లడించాడు.

జట్టు వివరాలు
రొమన్ పొవెల్ (కెప్టెన్), కేల్ మేయర్స్ (వైస్ కెప్టె న్), చార్లెస్, రోస్టన్ ఛేజ్, హెట్‌మెయిర్, హోల్డర్, షై హోప్, అకీల్ హుస్సేన్, అల్జరీ జోసెఫ్, నికోలస్ పూరన్, మెకాయ్, బ్రాండన్ కింగ్, ఒషానె థామస్, షెఫర్డ్, ఓడియన్ స్మిత్, రొమారియో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News