Friday, November 8, 2024

ఆఖరి టి-20 విండీస్‌దే

- Advertisement -
- Advertisement -

West Indies beat Australia by 16 runs in fifth T20

 

సెయింట్ లూసియా: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో ట్వంటీ-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆతిథ్య విండీస్ 41 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తించిన లూయిస్ 34 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 79 పరుగులు చేశారు. క్రిస్ గేల్ (21), వికెట్ కీపర్ పూరన్ (31) కూడా ధాటిగా ఆడడంతో విండీస్ భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కూడా బాగానే ఆడింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (34), మిఛెల్ మార్ష్ (30), మాథ్యూ వేడ్ (26) ధాటిగా ఆడారు. అయితే కీలక సమయంలో విండీస్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా విజయం అందుకోలేక పోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News