Tuesday, December 3, 2024

విండీస్‌దే టి20 సిరీస్

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టి20లో ఆతిథ్య వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 32తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాల్ట్ (38), లివింగ్‌స్టోన్ (28) మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో మోటి మూడు, హోల్డర్, రస్సెల్, అకిల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షాయ్ హోప్ 43 (నాటౌట్), రుథర్‌ఫోర్డ్ (30) జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News