Thursday, January 23, 2025

హేట్ మేయర్ ఔట్… విండీస్ 88/4

- Advertisement -
- Advertisement -

కెన్సింగ్‌టన్ ఓవల్: భారత్-వెస్టిండీస్ మధ్యజరుగుతున్న తొలి వన్డేలో విండీస్ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కైల్ మేయర్స్ రెండు పరుగులు చేసి హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. అలిక అతానాజే 22 పరుగులు చేసి ముకేష్ కుమార్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్రండన్ కింగ్ 17 పరుగులు చేసి టాగూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. సిమ్రాన్ హెట్‌మేయర్(11) పరుగులు రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో షాయ్ హోప్(26), రోవమాన్ పావెల్(0) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News