Sunday, January 19, 2025

విండీస్ 229/5

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: క్విన్స్ పార్క్ ఓవల్ మైదానంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 108 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 229 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. దీంతో భారత 209 పరుగులో ఆధిక్యంలో ఉంది. విండీస్ బ్యాట్స్‌మెన్లక్రైగా బ్రాత్‌వేట్ హాఫ్ సెంచరీతో చెలరేగగా మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో బ్రాత్‌వేట్ (75), చంద్రపాల్ (33), కిర్క్(32), బ్లాక్‌వుడ్(20), దిసిల్వా(10) పరుగలు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జాసన్ హోల్డర్(11), అతానాజే(37) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా ముకేష్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మాద్ సిరాజ్ తలో ఒక వికెట్ తీశారు. భారత జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News