Monday, April 7, 2025

విండీస్ లక్ష్యం 318

- Advertisement -
- Advertisement -

West Indies target is 318 runs

 

హామీల్టన్: మహిళా వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. విండీస్ ముందు 318 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. స్మృతి మంధనా, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగారు. మూడో వికెట్ పై హర్మన్ ఫ్రీత్, మంధనా 184 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి మంధనా 123 పరుగులు చేసి కన్నెల్ బౌలింగ్ లో సెల్మన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. హర్మన్ ప్రీత్ కౌర్ 109 పరుగులు చేసి అలైన్ బౌలింగ్ లో క్యాంప్ బెల్ కు క్యాచ్ మైదానం వీడింది. యాస్టికా భాటియా 31 పరుగులు చేసి సల్మెన్ బౌలింగ్‌లో మైదానం వీడింది. మిథాలీ రాజ్ ఐదు పరుగులు చేసి మ్యాథ్యూస్ బౌలింగ్ షమిలాకు క్యాచ్ ఇచ్చి ఔటయింది. దీప్తి శర్మ 15 పరుగులు చేసి మహ్మాద్ బౌలింగ్‌లో మ్యాథ్యూస్‌కు ఇచ్చి వెనుదిరిగింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐదు పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యింది. జూలన్ గో స్వామి రెండు పరుగులు చేసి డట్టిన్ బౌలింగ్ మహ్మాద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. విండీస్ బౌలర్లలో మహ్మాద్ రెండు వికెట్లు పడగొట్టగా కన్నెల్, మాథ్యూస్, సెల్మన్, డట్టిన్, అలియన్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News