Friday, December 20, 2024

రెండో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

అంటిగువా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌ను 11తో సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ విజయం సాధించింది. ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 32.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన ఫిలిప్ 4 ఫోర్లతో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన జాక్ క్రాలి (3), బెన్ డుకెట్ (3)లు కూడా విఫలమయ్యారు.

కానీ హారీ బ్రూక్‌తో కలిసి జాక్స్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జాక్స్ 4 సిక్సర్లు, ఆరు బౌండరీలతో 73 పరుగులు చేశాడు. మరోవైపు బ్రూక్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 43 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ 45 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో అజేయంగా 58 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు. సామ్ కరన్,లివింగ్‌స్టోన్ మూడేసి వికెట్లు తీశారు. రెహాన్, అక్టిన్సన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. విండీస్ టీమ్‌లో కెప్టెన్ షాయ్ హోప్ (68), రుథర్‌ఫోర్ట్ (63) రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News