Wednesday, January 22, 2025

విండీస్ క్రికెట్‌లో కొత్త జోష్..

- Advertisement -
- Advertisement -

West Indies win Test Series with 1-0 against ENG

సెయింట్ జార్జెస్: వరుస ఓటములతో సతమతమవుతున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్‌పై విజయం కొత్త దిశను చూపిందనే చెప్పాలి. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విండీస్ 1-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు టి20 సిరీస్‌ను విండీస్ దక్కించుకుంది. ఈ రెండు సిరీస్ విజయాలు విండీస్ టీమ్‌లో కొత్త జోష్‌ను నింపిందనడంలో సందేహం లేదు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును ఓడించడం విండీస్‌కు పెద్ద ఊరటగానే చెప్పాలి. సిరీస్ ఆరంభానికి ముందు విండీస్‌కు పెద్దగా ఆశలు లేవు. ఇంగ్లండ్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ విండీస్ తొలి రెండు టెస్టుల్లో అద్భుత ఆటను కనబరిచింది. రెండు మ్యాచులను డ్రా చేసి సత్తా చాటింది. అంతేగాక మూడో మ్యాచ్ లో ఏకంగా విజయం సాధించి పెను ప్రకంపనలే సృష్టించింది. కొంత కాలంగా సిరీస్ ఏదైనా ఓటమి పాలు కావడం అలవాటుగా మార్చుకున్న విండీస్‌కు ఈ విజయం కొత్త దిశను చూపుతుందనే చెప్పాలి.

West Indies win Test Series with 1-0 against ENG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News