బార్బోడాస్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బోలర్ జేసన్ హోల్డర్ చారిత్రక బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. చివరి మ్యాచ్‌లో హోల్డర్ వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్ వేసిన హోల్డర్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆఖరి ఓవర్ తొలి బంతి నోబాల్‌గా నమోదైంది. దీంతో ఫ్రీ హిట్ లభించింది. కానీ, తర్వాతి బంతికి జోర్డాన్ పరుగులేమి చేయలేదు. ఆపై హోల్డర్ చెలరేగి పోయాడు. రెండో బంతికి జోర్డాన్, మూడో బంతిక సామ్ బిల్లింగ్స్(41), నాలుగో బంతికి అదిల్ రషీద్(0), ఐదో బంతికి షకీబ్ (0)ను హోల్డర్ ఔట్ చేశాడు.
ఈ క్రమంలో విండీస్ తరఫున టి20ల్లో హ్యాట్రిక్ చేసిన తొలి బౌలర్‌గా అరుదైన నిలిచాడు. అయితే హోల్డర్ కాకుండా మరో ముగ్గరు బౌలర్లు ఈ ఫార్మాట్‌లో ఇలాంటి రికార్డును సాధించారు. వీరిలో శ్రీలంక స్పీడ్‌స్టర్ మలింగా, ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంపర్, అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ ఉన్నారు. అయితే, మలింగా ఈ ఫీట్‌ను రెండు సార్లు సాధించడం విశేషం. ఇదిలావుండగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టి20లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో విండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. హోల్డర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు లభించింది.
West Indies won by 17 Runs in 5th T20