Saturday, December 21, 2024

విండీస్ ఆశలు సజీవం

- Advertisement -
- Advertisement -

West indies won on zimbabwe

 

హోబర్ట్: టి20 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ సూపర్12 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జింబాబ్వేతో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో వెస్టిండీస్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ నాకౌట్ అవకాశాలు మళ్లీ చిగురించాయి. పసికూన స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌కు అవమానకర ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఇక జింబాబ్వేతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అసాధారణ ఆటతో అలరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జింబాబ్వేను 122 పరుగులకే కుప్పకూల్చడంలో విండీస్ బౌలర్లు సఫలమయ్యారు.

ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ రెగిస్ చకబ్వా 3 ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే టోని మునియోంగా (2) కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లను అల్జరీ జోసెఫ్ తీశాడు. ఆ వెంటనే సీన్ విలియమ్స్ (1) కూడా పెవిలియన్ చేరాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ వెస్లీ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి హోల్డర్ చేతికి చిక్కాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ సికందర్ రజా కూడా నిరాశ పరిచాడు. 14 పరుగులు మాత్రమే చేసి స్మిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మిల్టన్ శుంబా (2) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. చివర్లో రియాన్ బూరి (17), లుకె జోం గ్వే(29) కాస్త పోరాటం చేసినా ఫలితం లేకుం డా పోయింది. ఇక విండీస్ బౌలర్లలో జోసెఫ్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. జేసన్ హోల్డ ర్ 3 వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు.

చార్లెస్ ఒంటరి పోరాటం

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విం డీస్‌ను ఓపెనర్ జాన్సన్ చార్లెస్ ఆదుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న చార్లె స్ 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చే సి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతావారిలో రోమన్ పొవెల్ (28), అకిల్ హుస్సేన్ 23 (నాటౌట్) మాత్రమే కాస్త రాణించారు. దీంతో విండీస్ స్కోరు 153 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News