Monday, January 20, 2025

ఇంగ్లండ్‌కు విండీస్ షాక్

- Advertisement -
- Advertisement -

కరీబియన్ టీమ్‌కు మరో విజయం

 

డునెడిన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం సాధించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మరో ఓటమిని చవిచూసింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విండీస్ ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సంచలన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై కూడా విండీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వికెట్ కీపర్ క్యాంప్‌బెల్ (66) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్లు డాటిన్ (31), మాథ్యూస్ (45) కూడా బాగానే ఆడారు. ఇక చివర్లో చెడిన్ నేషన 49 (నాటౌట్) కూడా తనవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. బ్యూమౌంట్ (46), డానిలి వ్యాట్ (33), సోఫియా డంక్లి (38), సోఫి ఎక్లెస్టోన్ 33 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది. విండీస్ బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News