- Advertisement -
మౌంట్ మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలన ఫలితం నమోదైంది. శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు మూడు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ 16 ఫోర్లు, ఒక సిక్స్‌తో 119 పరుగులు చేసి జట్టును ఆదుకుంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 256 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ సోఫి డివైన్ (108) సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి జట్టును గెలిపించారు.
- Advertisement -