Thursday, January 23, 2025

సోషల్ మీడియాలో ఫొటోలు…. భార్యను నరికి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

అగర్తల: ఇద్దరు వ్యకులతో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భార్యను భర్త కత్తితో నరికి చంపిన సంఘటన త్రిపుర రాష్ట్రంలోని వెస్ట్ త్రిపురా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దంపతుల మధ్య గొడవ జరగడంతో రెండు సంవత్సరాల నుంచి తన ఇద్దరు కుమారులతో ఓ వ్యక్తి మధుపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య తన తల్లితో కలిసి వెస్ట్ త్రిపుర జిల్లాలో నేతాజీనగర్‌లో ఉంటుంది. ఆమె ఇద్దరు వ్యక్తులతో కలిసి దుర్గా పూజాలో పాల్గొంది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫొటోలను చూసిన భర్త ఆమెపై పగ పెంచుకున్నాడు. వెంటనే కత్తి తీసుకొని వారు ఉంటున్న ఇంటికి వెళ్లాడు. కత్తితో భార్య, అత్తపై అతడు దాడి చేశాడు. ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News