Sunday, December 22, 2024

తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ప్రజలు తమ గృహాల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపాలిటి వాహనాలకు అందించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. శనివారం సుధాకర్ పీవీసీ చైర్మన్ మీలా మహాదేవ్ అందించిన చెత్తబుట్టలను జిల్లా కేంద్రంలోని 10వ వార్డులోని జాహ్నవి టౌన్‌షిప్ లో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహాల్లోని చెత్తను ప్రజలు మురుగు కాల్వల్లో పడవేయకుండా తమ ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ ట్రాక్టర్లకు అందించాలన్నారు. స్వచ్ఛ సూర్యాపేట నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సహకారంతో గతంలో ఎన్నడు లేని విధంగా మున్సిపాలిటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, జాహ్నవి టౌన్‌షిప్ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News