న్యూఢిల్లీ: నగరానికి ఇంకా వ్యాక్సిన్ సామాగ్రి అందకపోవడంతో 18 ఏళ్లు పైబడిన వారికి రేపు టీకా వేయట్లేదని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాక ప్రకటన చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. 67 లక్షల టీకా డోసులకు ఆర్డర్ చేశామన్నారు. రేపు లేదా ఎల్లుండి 3లక్షల కొవిషీల్డ్ టీకాలు వస్తాయని సిఎం కేజ్రీవాల్ వెల్లడించారు. “దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాక్సిన్ల కోసం నమోదు చేసుకున్నారు, కాని మాకు స్టాక్ రాలేదు. మేము కంపెనీలతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాము, ఒకటి లేదా రెండు రోజుల్లో టీకాలు వస్తాయని మేము ఆశిస్తున్నాము” అని ముఖ్యమంత్రి తెలిపారు. రేపు, టీకాలు 18 నుంచి 44 మధ్య ఉన్నవారికి టీకాలు వేయాల్సిఉంది. అయితే తమకు టీకా నిల్వలు లేనందున డ్రైవ్ ప్రారంభించలేమని చెప్పారు. ఢిల్లీలో అర్హత ఉన్న వారందరికీ మూడు నెలల్లో టీకాలు వేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అన్ని మౌలిక సదుపాయాలు, ప్రణాళికలు అమల్లో ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. “ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వస్తుంది కాని మాకు అందరి సహకారం అవసరం.” అని కేజ్రీవాల్ తెలిపారు.
We’ve not received the vaccines yet says Delhi CM