Friday, December 20, 2024

వివర్క్ దివాలా పిటిషన్

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరో సంస్థ దివాలా పరిస్థితికి చేరింది. కోవర్కింగ్ స్టార్టప్ వివర్క్ అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. న్యూజెర్సీ కోర్టులో దాఖలు చేసిన దివాలా పిటిషన్ ఆధారంగా ఈ కంపెనీ చెల్లింపులు చేయాల్సిన మొత్తం 10 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. సంస్థ సిఇఒ డేవిడ్ టోల్లే మాట్లాడుతూ, గత లీజులను పరిష్కరించి, బ్యాలెన్స్ షీట్‌ను వేగంగా మెరుగుపర్చి దూకుడుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సంస్థ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

భారత్‌లో సేవలపై ప్రభావం ఉండదు
అమెరికాకు చెందిన కోవర్కింగ్ స్టార్టప్ వివర్క్ అమెరికాలో దివాలా ప్రభావం భారత్‌లో వ్యాపారంపై ఉండదని వివర్క్ ఇండియా సిఇఒ కరన్ విర్వాని తెలిపారు. ఇక్కడ వివర్క్ గ్లోబల్ స్వతంత్రంగా సేవలు అందిస్తోందని, అమెరికాలో దివాలా ప్రభావం భారత్‌లో ఉండదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News