Wednesday, January 22, 2025

వర్క్ ఫ్రమ్ హోం భారత్‌కు సరిపడవు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల తగ్గుదలతో ప్రపంచవ్యాప్తంగా క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి. వర్క్‌ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడిన ఉద్యోగులు భారంగా ఆఫీసుల బాట పడుతున్నారు. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్ట్‌ప్‌ల దాకా వర్క్‌ఫ్రమ్ పద్ధతికి స్వస్తి చెబుతున్నారు. ఇక వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి కొందరు మద్దతు పలుకుతుండగా మరి కొందరు ఈ విధానంలో ఎదురయ్యే ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్. నారాయణమూర్తి ఇంటి నుంచి పని చేసే పద్ధతి భారత్‌కు సరిపడదని అభిప్రాయపడ్డారు. తాను వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు అనుకూలం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుంటే సంస్థాగత సంస్కృతి క్రమం గా బలహీన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంటి వద్ద నుంచి పని చేసే సం స్కృతి ద్వారా కష్టించి పని చేయడం, సృజనాత్మకత, నైపుణ్యం, ప్రతిభను వెలికి తీయ డం, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుదల సాధించడం కష్టమని అన్నారు. భార త్ లాంటి పేలవమైన ఇంటర్‌నెట్ బ్యాండ్ విడ్త్ కలిగిన దేశాల్లో చాలా మందికి హోం ఆఫీసును ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రూం వంటిది వుండదన్నారు. కొవిడ్ సమయంలో భారత్‌లో ఉత్పాదకత బంగ్లాదేశ్ కంటే తక్కువగా వుందని గుర్తు చేశారు. కార్పొరేట్లు ఉత్పాదకతను పెంచుకునేందుకు తిరిగి కార్యాలయాల బాట పట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయంలో చైనాను అధిగమించాలంటే భారత్ వంటి దేశాలకు ఇది చాలా కీలకమని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇక నారాయణ మూర్తి ప్రకటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమయింది.

WFH Not Suitable for India: Infosys founder Narayana Murthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News