Monday, December 23, 2024

వామ్మో బ్లాస్టింగ్

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు: మెగా ప్రాజెక్టు పనులు ప్రాణాలకు సంకటంగా మారాయి. బ్లాస్టింగ్‌తో ప్రజలు బతుకులకు భరోసా లేక కొట్టుమిట్టాడుతూ భద్రత కోసం ఎదురు చూస్తున్న ఘటన చిన్నకోడూరు మండల పరిధిలో ఎల్లాయ పల్లి మధిర కాసారం పల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే కాసారంపల్లి సమీపాన నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని లింకు 4 ప్యాకేజి 2లో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇస్టారీతిగా మెగా కంపెనీ అధికారులు బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.

బ్లాస్టింగ్‌తో గ్రామ ప్రజల ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ సందర్భంగా స్థ్ధానికులు మాట్లాడుతూ లింక్ 4 ప్రాజెక్టులో తరుచూ బ్లాస్టింగులు నిర్వహించి ఆస్థి నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఇరువైపుల ఉన్న నివాసితులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్‌లు చేయడం వల్ల ఎప్పుడు ఏమైతుందోనన్న భయంతో రోజులు గడుపుతున్నామన్నా రు. ఏసమయంలో ఏవైపు నుంచి ఏ రాయి వచ్చి పడతాయోననీ బిక్కు బిక్కు మంటూ జీవనం కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

గ్రామానికి చెందిన కాసారం రాజిరెడ్డి ఇంటి రేకులపై రాళ్లు పడి రేకులు ద్వంసం అయ్యాయన్నారు. దీంతో స్థానికులుప్రాజెక్టు దిగువ స్థ్ధాయి అధికారులను బ్లాస్టింగ్ పై ప్రశ్నించగా రేకులే కదా తిరిగి ఇప్పిస్తామని నిర్లక్షంగా సమాదానం చెబుతున్నారని తమ గోడు ను వెళ్లబుచ్చారు. బ్లాస్టింగ్‌లతో గ్రామం బెంబెలెత్తుతున్న మెగా కంపెనీ అధికారులు మాత్రం అంటి ముట్టనట్లుగా పనులు కొనసాగించడం విశేషం, దీంతో భయాందోళనతో ఉన్న గ్రామస్తులు శుక్రవారం ప్రాజెక్టు పనులను అడ్డుకోడానికి సిద్ధం అయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ శివానందం ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో సంతృప్తి చెందని ప్రజలు సమస్య పరిష్కారం కావాలని పట్టుబట్టారు. దీంతో ఎస్‌ఐ ప్రాజెక్టు అధికారులతో త్వరితగతిన మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వ్యక్తిగత హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News