Friday, December 27, 2024

ప్రీతి మృతికి కారణమైన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు? : హైకోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్‌కు చెందిన పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్‌టి ఉద్యోగుల సంఘం సంక్షేమ అధ్యక్షుడు మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేఖలో కోరారు. సిబిఐతో దర్యాప్తు చేయించాలని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో పర్యవేక్షించేలా చూడాలని మల్లయ్య లేఖలో కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రీతి మృతికి కారణమైన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంది. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ర్యాగింగ్ నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఏ మేరకు అమలు చేస్తున్నారో చెప్పాలని పేర్కొంటూ తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News