Friday, December 20, 2024

ప్రమాదకర బావులకు రక్షణ గోడలు ఏవీ ?

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: రహదారుల పక్న ఉన్న బావుల తో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రోడ్డే కదా అంటూ వాహనదారులు ఇష్టారీతిన రయ్‌ర య్ మంటూ వెలుతుంటారు. అంతే రోడ్ల పక్కన చెట్ల పొదల మధ్య ఉన్న బావుల వద్ద రక్షణ గోడలు లేవు. కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు.

వాహన దారులు అదుపు తప్పితే ఉహించని ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది.అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సందర్శించి రోడ్ల పక్కన ఉన్న బావులను గుర్తించి రక్షణ గోడల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. వెల్గటూర్ మం డలంలోని గ్రామాల్లో రోడ్ల పక్కనే వ్యవసాయ, నిరుపయోగం గా ఉన్న బావులు ఉన్నాయి.

వాటి చుట్టూ పిచ్చి మొక్కలు ,చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో బావుల ఆనవాళ్లు కనిపించకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. వెల్గటూర్ మండలం శాఖాపూర్ బస్ స్టాండ్ నుండి పూసాల వీధి నుండి కప్ప రావుపేట పాత గ్రామానికి వెళ్లే సిసి రోడ్డు లో చెట్ట పొదల మధ్యన రక్షణ లేని వ్యవసాయ బావి ఉంది. బావుల వద్ద రక్షణ గోడలు నిర్మించలేదు.

కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవు. శాఖాపూర్ స్టేట్ హైవే నుండి చెగ్యాం వేళ్లే రహదారి కలదు . స్టేట్ హైవే నుండి గంగపుత్ర కాలనీ మీదుగా ఎస్సీ కాలనీ తోపాటు ప్రభుత్వ పాఠశాల వరకు సిసి రోడ్డు నిర్మాణం కోనసాగుతుంది. దీంతో అటు వైపు వేళ్లే వాహనాలను పూసాల వాడ గుండా మళ్లించారు.

నిత్యం రద్దీగా ఉండే రహదారిలో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం వల్ల వాహన దారులు తప్పనిసరిగి ఇటువైపుగా వెల్లవలసి వస్తుంది. కనీసం సిసిరోడ్డునిర్మాణం పనులు చేపట్టె గుత్తే దారైనా పట్టించుకుపోవడం తో వాహనదారులు అరిచేతిలో ప్రాణాలను పెట్టుకుని ప్ర యాణం కోనసాగిస్తున్నారు.వాహనదారులు ఏమాత్రం అజాత్రత్తగా ఉన్నా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశంలేక పోలేదు. ఇప్పటికైనా అధికా రులు చోరవ తీసుకుని రోడ్డు పక్కన ప్రమాదకర బావుల వద్ద అడ్డుగోడులు నిర్మించేలా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News