Monday, December 23, 2024

అంగారక గ్రహం పొడిబారడానికి కారణం?

- Advertisement -
- Advertisement -

What causes Mars to dry up?

 

చికాగో : అంగారక గ్రహం తన వాతావరణంలో కార్బన్‌డై యాక్సైడ్‌ను కోల్పోవడం వల్ల పొడిగా ఎడారిలా మారిందని ఇదివరకటి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ గ్రహం వాతావరణంపై కొత్తగా అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తలు కొన్ని వేల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై వెచ్చదనంతోపాటు తడి కూడా ఉండేదని రానురాను చల్లగా, పొడిగా అక్కడి వాతావరణం మారుతూ వచ్చిందని చెబుతున్నారు. దీనికి సాక్షంగా నదీ తీరాలు, డెల్టాల అవశేషాలు కనిపిస్తున్నాయని, ఒకప్పుడు ఈ గ్రహం నదులకు, సరస్సులకు నిలయంగా ఉండేదని యూనివర్శిటీ ఆఫ్ చికాగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 3 బిలియన్ నుంచి 3.6 బిలియన్ సంవత్సరాల క్రితం నదులకు, సరస్సులకు అనుకూల మైన వెచ్చని వాతావరణం ఉండేదని వివరించారు. ప్రస్తుతం ఉపరితలంపై ద్రవ రూపంలో నీటి ఉనికి ఉండేందుకు అనువైన అతిశీతల, తేలికపాటి వాతావరణం నెలకొందని యూనివర్శిటీ ఆఫ్ చికాగో జియోఫిజికల్ సైంటిస్టు ఎడ్విన్ కైట్ పేర్కొన్నారు.

అయితే ఈ విధంగా వాతావరణం మారడానికి కచ్చితమైన కారణాలు తాము వెల్లడించలేకపోతున్నా అనేక మంది అనేక ఆలోచనలు ముందుకు తెస్తున్నారని చెప్పారు. నివాస యోగ్యం నుంచి నివసించలేని ఆవాసంగా మారిన గ్రహం ఇదొక్కటే అయినందున తాము ఈ వాతావరణాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ కోల్పోవడమే అంగారక గ్రహం ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని చాలామంది శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నా కైట్ అతని సహచర శాస్త్రవేత్తలు ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా బలపర్చడం లేదు. నదుల ఉనికికి కార్బనేతర వనరుల నుంచి వేడిమి అవసరమని కైట్ చెబుతున్నారు. అంగారక గ్రహంపై ఇదివరకు ఎత్తైన పర్వతాలు ఉండేవని, కానీ అవి తరువాతి దశల్లో నదులు ఏర్పడేందుకు వీలుగా మారాయని కైట్ ఇదివరకటి విశ్లేషణ వెల్లడించింది. హరిత వాయువుల ప్రభావానికి వాతావరణ మార్పులకు సంబంధం ఉందని గ్రహ వాతావరణ శాస్త్రవేత్త బొవెన్ ఫాన్ చెప్పారు. ఈ గ్రహం తాలూకు శాటిలైట్ ఇమేజిల ద్వారా గ్రహంపై నదుల చరిత్రను, వాటి మార్పును విశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News