Monday, December 23, 2024

బిజెపిపై సిసోడియా విమర్శ

- Advertisement -
- Advertisement -

Manish Shisodia

న్యూఢిల్లీ: బిజెపి ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించే కలవరపడుతుందే తప్ప కశ్మీర్ పండిత్‌ల గురించి కాదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కశ్మీరీపండిత్‌ల కోసం చాలా చేశారన్నారు. ‘వారి వద్ద సరైన డాక్యుమెంట్లు లేకున్నప్పటికీ 223 టీచర్లకు పర్మనెంట్ హోదా కల్పించారు. పింఛను విధానాన్ని సక్రమం చేశారు. ఢిల్లీలో ఉన్న కశ్మీరీ పండిత్‌లకు నెలకు ఒక్కొక్కరికి రూ. 3000 కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ పండిత్‌లు తిరిగి కశ్మీర్‌కు వెళ్లాలనుకుంటున్నారు. బిజెపి 8 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. కానీ కశ్మీరీ పండిత్‌లకు ఏమి చేసింది?’ అని మనీశ్ సిసోడియా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News